'
English
Advertisement

వారసులకే పెద్దపీట

వారసులకే పెద్దపీట

ఎన్నికల సమరభేరీ మొదలైంది. పార్టీలోని ఆశావాహులు టిక్కెట్ల కోసం పడిగాపులు పడుతుంటే. పార్టీ అధినేతలు మాత్రం టిక్కెట్ల పంపిణీతో బిజీ బిజీగా ఉన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు టిక్కెట్ల పంపిణీ విషమమై ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో ఎట్టి పరిస్దితులలోను తప్పటడగులు వేయకుండా జాగ్రత్తతో వ్యవహరించాలని తన పార్టీ  నేతలకు పదే పదే చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాలకు గాను 126 ప్రకటించారు బాబు. ఈ సారి అభ్యర్దుల ఎంపికలో కొన్ని మార్పులు చేర్పులూ చేసారు కూడా. అయితే వారసులకు కూడా పెద్దపీటే వేసారు. అంతే కాకుండా కొన్ని చోట్ల అభ్యర్దులను కూడా మార్చారు. కోవూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్. జవహర్ ను క్రిష్ణ జిల్లా తిరువూరు అసెంబ్లీ టిక్కెట్టును కేటాయించారు. అలాగే విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు మార్చారు.

ఈ సారి యువతకు తెలుగుదేశం పార్టీ ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లు కనిపిస్తోంది.  గాలి ముద్దుక్రిష్ణమ నాయుడి కుమారుడు గాలి భానుప్రకాష్ కు నగరి సీటు దక్కింది. చీపురుపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మ్రునాళిని తనయుడు కిమిడి నాగార్జునకు అవకాశం ఇచ్చారు. పలాస నుంచి గౌతు శివాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమార్తే గౌతు శిరీషను బరిలోకి దింపుతోంది తెలుగుదేశం పార్టీ.

గుడివాడ శాసనసభ స్దానానికి దేవినేని నేహ్రు కుమారుడు దేవినేని అవినాశ్ బరిలోకి దిగనున్నారు. ఇంకా రాజమండ్రి నుంచి ఆదిరెడ్డి భవానీ, పత్తికొండ నుంచి కేఈ. శ్యామ్, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, విజయవాడ పశ్చిమం నుంచి షబానా ఖతూన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తొలిసారిగా బరిలోకి దిగనున్నారు. వీరంతా కూడా వారసులే...తొలిసారిగా ఎన్నికలలో పోటికి సిద్దపడుతున్నారు.

అతి తక్కువ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సారి టిడీపీలో పోటీకి అవకాశం దక్కింది. ఈ సారి యువతకు పెద్దపీట వేయలనే ఉద్దేశ్యంతో వారాసులకు అవకాశం ఇచ్చామని చంద్రబాబు నాయుడు చెపుతున్నారు.

Advertisement
 
Home
News
Photos
తెలుగు