'
English
Advertisement

జ‌నం తీర్పు ఏదైనా... గ‌వ‌ర్న‌మెంటు బీజేపీదేనా!

జ‌నం తీర్పు ఏదైనా... గ‌వ‌ర్న‌మెంటు బీజేపీదేనా!

గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ వివాదాస్ప‌దం అవ‌డం ఓ వైపు...ప్రాజాస్వామ్యం ప‌రిహాసం అవ‌డం మ‌రోవైపు...దేశంలో ఎందుకిలా జ‌రుగుతోంది? ఒక రాష్ట్రం త‌ర్వాత మ‌రో రాష్ట్రం అన్న‌ట్లుగా మెజార్టీకి సంబంధం లేకుండా ప‌రిపాల‌న ఏర్ప‌డ‌టం ఏంటి? ఇది అనేక మందిలో ప్ర‌స్తుతం నెల‌కొంటున్న సందేహం. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే ఆవేద‌న‌. గ‌త ఏడాది జ‌రిగిన గోవా, మ‌ణిపూర్ ఫ‌లితాలు....అక్క‌డ రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏర్పడిన తీరు దానికి కొన‌సాగింపుగా ప్ర‌స్తుతం క‌న్న‌డ నాట చోటుచేసుకుంటున్న అంశాల‌తో ఈ ఆందోళ‌న తెర‌మీద‌కు వ‌స్తోంది.

గ‌త ఏడాది జ‌రిగిన గోవా ఎన్నికల్లో కాంగ్రెస్-17సీట్లతో తొలిస్థానంలో, 13సీట్లతో బీజేపీ రెండోస్థానంలో నిలిచాయి. కానీ స్థానిక పార్టీల నుంచి నేతలు బీజేపీకే మద్దతు పలకడంతో పారికర్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యారు. ఇక మణిపూర్ లోను ఇదే పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 21సీట్లు, కాంగ్రెస్ 27సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ కే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. బీజేపీ తమకు 31మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు ప్రకటించింది. దీంతొ మణిపూర్ లోను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది. ఫ‌లితాలు ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో ఒకటైన గోవాలో ఏ పార్టీకి మెజారిటీ రాకున్నా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్‌ పర్రీకర్‌ను గవర్నర్‌ మృదులా సిన్హా నియమించి, ప్రమాణం చేయడానికి ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికి మెజారిటీ రాకుంటే సభలో మిగిలిన పార్టీల కన్నా ఎక్కువ సీట్లొచ్చిన పెద్ద పార్టీని (సింగల్‌ లార్జెస్ట్‌ పార్టీ) ఆహ్వానించాలనేది కొన్ని దశాబ్దాలుగా పలు సందర్భాల్లో సంప్రదాయంగా మారింది. మరి గోవాలో ప్రస్తుత పాలకపక్షం బీజేపీ(17) కన్నా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు(21) నాలుగు సీట్లు ఎక్కువొచ్చాయి.  

తాజాగా బెంగ‌ళూరు కూడా ‘గోవా’ పునరావృతం చేయడానికి రంగం సిద్ధమైందనేది చాలా మంది మాట‌. ఎస్సార్ బొమ్మయి కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం మెజారిటీ పార్టీ లేదా పార్టీల కూట‌మినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంది. ఇది సుప్రీంతీర్పు ప్ర‌కార‌మే జ‌రిగింది.  మ‌రి అదే న్యాయం క‌ర్ణాట‌క‌లోనూ పాటించాలి. అయితే గవర్నర్‌ అలా చేస్తారా అనేది ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌. క‌న్న‌డ నేల‌కు పొరుగున ఉన్న రాష్ట్రమైన గోవాలో కంటే దారుణంగా... ఒక పార్టీని నిలువునా చీల్చ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది బీజేపీ. కాబ‌ట్టి ఇక్క‌డ కూడా గోవాలాగే బీజేపీ గ‌వ‌ర్న‌మెంటు ఏర్పాటుచేసి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తార‌ని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

Advertisement
 
Home
News
Photos
తెలుగు