'
English
Advertisement

‘నా పేరు సూర్య’ రిలీజ్ డేట్ మారింది

‘నా పేరు సూర్య’ రిలీజ్ డేట్ మారింది

మొన్నటిదాకా ఏప్రిల్ 27న పక్కా.. ఏప్రిల్ 27న పక్కా అంటూ వచ్చింది ‘నా పేరు సూర్య’ టీం. ఐతే ఇప్పుడు ఆ చిత్ర బృందం తమ సినిమా రిలీజ్ డేట్ మార్చేసింది. అలాగే ఈ సినిమా ఏప్రిల్ చివరి వారాంతం నుంచి ముందుకూ వెళ్లలేదు. వెనక్కీ రాలేదు. అదే వారాంతంలో రాబోతోంది.

కానీ రిలీజ్ డేట్ మాత్రం మారింది. ఏప్రిల్ 27న కాకుండా 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. ఈ మేరకు ఈ చిత్ర సహ నిర్మాత బన్నీ వాస్ ప్రకటన చేశాడు. ఏప్రిల్ 27న సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కాలా’ వస్తుందని రెండు రోజుల కిందటే చిత్ర నిర్మాత ధనుష్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అదే తేదీకి షెడ్యూల్ అయి ఉన్న ‘నా పేరు సూర్య’.. ‘భరత్ అను నేను’ల పరిస్థితి ఏంటా అని అంతా ఆసక్తిగా చూశారు. ‘2.0’ ఏప్రిల్ 27న వస్తుందన్నపుడు గొడవ గొడవ చేసిన ఈ చిత్రాల నిర్మాతలు.. ‘కాలా’ విషయంలో మాత్రం నోరు మెదపలేదు. ఇప్పుడు బన్నీ వాస్ ఏమో తమ సినమాను ఒక రోజు ముందుకు జరుపుతున్నట్లు ప్రకటించాడు. మరి ‘భరత్ అను నేను’ సినిమా పరిస్థితేంటో చూడాలి.

‘నా పేరు సూర్య’ పక్కాగా ఏప్రిల్ 26న వచ్చేట్లయితే మహేష్ సినిమాను ముందుకో వెనక్కో తీసుకెళ్లడం ఖాయమని అంటున్నారు. ఈ చిత్రం మార్చి నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసుకుంటుందట. ‘నా పేరు సూర్య’ కూడా దాదాపుగా అదే సమయానికి రెడీ అవుతుంది.

Advertisement
 
Home
News
Photos
తెలుగు