'
English
Advertisement

చివరికి సన్నీకి కూడా ధోనీనే..

చివరికి సన్నీకి కూడా ధోనీనే..

సాధారణ క్రికెట్ అభిమానులే కాదు.. సెలబ్రెటీలు సైతం టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని చాలా ఇష్టపడతారు. మామూలుగా స్టార్ క్రికెటర్లకు అభిమానులతో పాటు వ్యతిరేకులు కూడా ఉంటారు. ఐతే ధోనికి ఆ తరహా వ్యతిరేకత చాలా తక్కువ. మెజారిటీ క్రికెట్ అభిమానులు అతడిని ఇష్టపడతారు. ఆటగాడిగా ధోనిని ఎంత అభిమానిస్తారో.. అదే స్థాయిలో వ్యక్తిగానూ అతడిని ఇష్టపడతారు.

అతడి సింపుల్ లైఫ్ స్టైల్ కూడా అందరికీ ఎంతో నచ్చుతుంటుంది. మహేంద్రుడి వ్యక్తిత్వానికి, అతడి జీవన శైలికి ఫిదా అయిపోయిన వాళ్లలో ఒకప్పటి శృంగార తార, ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కూడా ఉండటం విశేషం. ధోని అంటే తనకు చాలా ఇష్టమని ఆమె అంటోంది. ఒక టీవీ షోలో భాగంగా నీకిష్టమైన క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా ధోని పేరు చెప్పింది సన్నీ.

ఇంతకీ ధోని అంటే ఎందుకంత ఇష్టం అని సన్నీని అడిగితే.. ధోని ఫ్యామిలీ పర్సన్‌ అని.. ఆయనలో తనకు నచ్చే ప్రధానమైన విషయం అదేనని చెప్పింది సన్నీ. ధోని వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం ఏదో రకంగా సమయం కేటాయించుకుంటాడని పేర్కొంది. ధోని తన కుమార్తె జీవాతో కలిసి దిగే ఫొటోలంటే తనకు చాలా ఇష్టమని,అవి  చాలా క్యూట్‌గా ఉంటాయని చె్పింది సన్నీ. ధోని గొప్ప క్రికెటర్‌ అని తెలుసని.. కానీ ఆట పరంగా ధోని గురించి తనకు లోతుగా తెలియనది సన్నీ చెప్పింది.

తాను క్రికెట్ పెద్దగా ఫాలో అవనని సన్నీ వెల్లడించింది. సన్నీ ఇటీవలే ‘తేరా ఇంత్‌జార్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు టీవీ షోలు, మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు దక్షిణాది సినిమాలు కూడా ఉండటం విశేషం. హిందీలో నటించబోయే సినిమాకు సన్నీనే నిర్మాతగా వ్యవహరించనుండటం గమనార్హం.

Advertisement
 
Home
News
Photos
తెలుగు