'
English
Advertisement

రకుల్‌కు ఆ అలవాటు లేదట

రకుల్‌కు ఆ అలవాటు లేదట

సినీ ఫీల్డులోకి వస్తే సకల దురలవాట్లూ వస్తాయన్నది జనాల నమ్మకం. మగాళ్లయినా.. ఆడాళ్లయినా ఈ రంగంలోకి వస్తే వ్యసనాల్లేకుండా కొనసాగలేరని అనుకుంటూ ఉంటారు. చాలా మంది విషయంలో అది నిజమే అవుతుంది. ఇండస్ట్రీలో మద్యం తాగే అలవాటు సర్వ సాధారణం.

తరచుగా పార్టీలు జరుగుతుంటాయి కాబట్టి మందు కొట్టే అలవాటు లేని వాళ్లను కూడా ఇందులోకి దించేస్తుంటారు. నెమ్మదిగా వ్యసనాలకు అలవాటు పడేలా చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం మందు జోలికి వెళ్లకుండా నిగ్రహం పాటిస్తారు. తాను ఆ కేటగిరీకే చెందుతానని అంటోంది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

తన కొత్త సినిమా ‘అయ్యారీ’ ప్రమోషన్లలో భాగంగా ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ఈ విషయం చెప్పింది. తాను మద్యానికి దూరమని అంది. తన బోరింగ్ లైఫ్ అని.. పార్టీల్లో మద్యం జోలికి వెళ్లనని ఆమె అంది. ఇక ఈ వయసులో రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడం కామనే కదా అని అడిగితే.. తాను ఇప్పటిదాకా ఎవరితోనూ ప్రేమలో పడలేదని.. తాను సింగిల్ అని ఆమె స్పష్టం చేసింది. ఈ వయసులో మంచి స్థాయిలో ఉండి ఏ రకంగానూ ఎంజాయ్ చేయాలని అనుకోకపోవడం ఆశ్చర్యమే.

తెలుగులో ‘స్పైడర్’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న రకుల్ ప్రీత్‌.. కొత్తగా ఏ సినిమా కమిటవ్వలేదు. ‘అయ్యారీ’తో బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిపోవాలని చూస్తున్న రకుల్‌కు ఈ నెల 16న ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.


Advertisement
 
Home
News
Photos
తెలుగు