'
English
Advertisement

మ‌న జ‌నాల‌ను చూసి పారిపోయిన హీరో

మ‌న జ‌నాల‌ను చూసి పారిపోయిన హీరో

ఇమ్రాన్ హ‌ష్మి... తెలుగు హీరో కాదు. అయినా స‌రే ఆ బాలీవుడ్ హీరోను చూసేందుకు జ‌నాలు గుమిగూడారు. ఎంత‌గా అంటే... ఇమ్రాన్ హష్మి కారు దిగ‌కుండా అటునుంచి అటే పారిపోయేంత‌గా. ఇదంతా మ‌న హైద‌రాబాద్‌లోనే జ‌రిగింది.

అజ‌హ‌రుద్దీన్ జీవిత‌క‌థ‌లో హీరోగా న‌టించాడు ఇమ్రాన్ హ‌ష్మి. అంత‌కుమించి అత‌ను తెలుగులో సినిమాలో నేరుగా న‌టించింది లేదు. కానీ ఇమ్రాన్ కు ఓ రేంజ్ అభిమానులు ఉన్నారు హైద‌రాబాద్‌లో. టోలిచౌకిలో ఆయ‌న ఓ షాప్ ఓపెనింగ్‌కు వ‌చ్చారు. ఆయ‌న వ‌స్తున్నార‌ని తెలుసుకున్న సినీ జ‌నాలు వంద‌లాదిగా మాల్‌కు చేరుకున్నారు. నిర్వాహ‌కులు ఊహించ‌నంత‌గా అభిమానులు వ‌చ్చేశారు. నాలుగు ఫ్లోర్ల మీద నుంచి తొంగిచూడ‌సాగారు. మాల్ ఎంట్ర‌న్స్ ద‌గ్గ‌ర‌, రోడ్డుమీద కూడా వంద‌లాది మంది గుమిగూడారు. మాల్ కు ఇమ్రాన్ హ‌ష్మి కారు చేరుకోగానే ఒకేసారి గుంపుగా వెళ్లి ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు అడ‌గ‌డం మొదలుపెట్టారు. వారిని చూసి ఇమ్రాన్ కింద‌కు దిగ‌కుండా కారులోనే ఉండిపోయాడు.

జ‌నాలు కొంచెం త‌గ్గాక వెళ్దామ‌ని ఆగాడు. అర‌గంట పాటూ కారులోనే కూర్చున్నా కూడా జ‌నాలు అలాగే ఉన్నాడు. దీంతో అటు నుంచి అటే వెళ్లిపోయాడు ఇమ్రాన్‌. అయినా మ‌న జ‌నాలు క‌ద‌ల‌కుండా చాలా సేపు అక్క‌డే ఉన్నారు. ఇమ్రాన్ తిరిగి వ‌స్తాడ‌ని వారు అనుకున్నారు. కానీ ఆ హీరో మ‌ళ్లీ రాలేదు. మ‌న జ‌నాలు బాలీవ‌డ్ హీరోను భ‌య‌పెట్టి పంపేశార‌న్న‌మాట‌. పాపం షాప్ ఓపెనింగ్ చేయిద్దామ‌ని ఆ హీరోకు భారీగా డ‌బ్బులిచ్చి ర‌ప్పించిన య‌జ‌మానులు ఉసూరుమంటున్నారు.

Advertisement
 
Home
News
Photos
తెలుగు