English
Advertisement

అల్లుడి కోసం చెక్కుతున్న మారుతి!

అల్లుడి కోసం చెక్కుతున్న మారుతి!

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం సవ్యసాచి మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి తర్వాత.. చైతు చేయబోయే సినిమా ఏంటనే విషయం ఇప్పటికే ఖరారైంది.

మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు మారుతి. ఇప్పటికే దాదాపు స్క్రిప్ట్ పూర్తయిపోయిందని.. ప్రస్తుతం దీనికి తుది మెరుగులు చెక్కుతున్నాడు ఈ దర్శకుడు. శర్వానంద్ మహానుభావుడు తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన మారుతి.. చెయ్ తో చేయబోయే మూవీతో మాంచి హిట్టు సాధించేందుకు తెగ తపన పడుతున్నాడు ఈ డైరెక్టర్. ఇదో వినూత్నమైన సబ్జెక్ట్ అని తెలుస్తోంది.

ఈ సంక్రాంతి పండుగ మొత్తం.. చైతు- అను ఇమాన్యుయేల్ కాంబినేషన్ రూపొందించే మూవీ పనుల్లోనే గడపనున్నాడట మారుతు. మరోవారం రోజుల్లో షూటింగ్ ప్రారంభించేయనుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సహజంగా తన సినిమాలకు టైటిల్ ను ముందే అనౌన్స్ చేసేయడం ఈ డైరెక్టర్ కు ఆనవాయితీ. శైలజా రెడ్డి అల్లుడు అనే వర్కింగ్ టైటిల్ ను పరిశీలిస్తుండగా.. ఇప్పటికే ఈ పేరుకు పాజిటివ్ వైబ్రేషన్స్ రావడంతో.. దాదాపుగా ఇదే పేరును ఫైనల్ చేసేందుకు టీం డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Home
News
Photos
తెలుగు