English
Advertisement

ఫైనల్ వచ్చేవరకూ ఆగాలిగా అభిమానులూ

ఫైనల్ వచ్చేవరకూ ఆగాలిగా అభిమానులూ

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు స్టార్ట్ చేసేశారు. జైసింహాకు తొలిరోజు మంచి వసూళ్లు రావడం.. స్ట్రాంగ్ పోటీ మధ్యలో కూడా కెరీర్ లో టాప్ థర్డ్ కలెక్షన్స్ ను బాలయ్య సాధించడంతో హుషారు బాగానే ప్రదర్శిస్తున్నారు.

తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా వసూళ్లను జైసింహా ఫేర్ చేసిన సంగతి తెలిసిందే. జైసింహా చిత్రంతో బాలయ్య 27 కోట్లను రాబడితే చాలు.. ఈ చిత్రం సక్సెస్ అయిపోయినట్లే. ఇంకా పండుగ సెలవలు ఉండడంతో.. ఈ మొత్తాన్ని బాలయ్య ఈజీగా రాబట్టేస్తారంటూ.. నందమూరి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసేసుకుంటున్నారు. అంతే కాదు.. సింహ సెంటిమెంట్ బాలకృష్ణకు కలిసొస్తుందంటూ చెప్పేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణకు.. సంక్రాంతికి సింహ సెంటిమెంట్ వర్కవుట్ అయిందని అంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా.. బొబ్బిలి సింహం.. సమర సింహా రెడ్డి.. నరసింహ నాయుడు.. లక్ష్మీ నరసింహ చిత్రాల సక్సెస్ ను చూపుతున్నారు.

అయితే.. కనీసం వీకెండ్ వరకూ అయినా ఆగకుండా మరీ ఇంత అడ్వాన్స్ అయిపోవడం కొంత అభ్యంతరకరమే. తొలిరోజున వసూళ్లు మూవీ ఫేట్ ని డిసైడ్ చేయలేవని ఒప్పుకోవాలి. పైగా సంక్రాంతి సీజన్ లోనే సీమసింహం వంటి ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చిన సంగతిని యాంటీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ముందు స్టేట్మెంట్స్ ఇచ్చేసి తర్వాత డీలా పడేకంటే.. కాస్త సేఫ్ జోన్ వరకూ వచ్చేవరకైనా ఆగాలని బాలయ్య ఫ్యాన్స్ కు ఎవరు చెబుతారో?

Advertisement
 
Home
News
Photos
తెలుగు