English
Advertisement

మహేశ్ విలువ‌లు కోల్పోయాడు: త‌మ్మారెడ్డి

మహేశ్ విలువ‌లు కోల్పోయాడు: త‌మ్మారెడ్డి

ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య కొద్ది రోజులుగా తీవ్ర‌స్థాయిలో వెర్బ‌ల్ వార్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌తో చ‌ర్చ‌కు రావాలంటూ ప‌వ‌న్, పూనమ్ కౌర్ ల‌కు క‌త్తి మ‌హేష్ స‌వాల్ విస‌రడం....ఆ త‌ర్వాత టీవీ షో డిబేట్ల‌లో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం విదిత‌మే. ప‌వ‌న్ అభిమానులంద‌రూ...15వ‌తేదీ వ‌ర‌కు స‌హ‌నం వ‌హించాల‌ని ర‌చ‌యిత్ కోన వెంక‌ట్ చెప్పారు. ఆ రెండు వ‌ర్గాల మ‌ధ్య కోన వెంక‌ట్ రాజీ కుద‌ర్చ‌బోతున్నాడ‌ని వార్తలు వ‌చ్చాయి. దీంతో, ఈ నెల 15న ఈ వివాదానికి తెర‌ప‌డబోతోంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై ప్ర‌ముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ మాటల యుద్ధం ఆపేయాల‌ని, లేదంటే దాని ప‌రిణామాలు ఇబ్బందిక‌రంగా ఉంటాయ‌ని అన్నారు. ఓ ఇంటర్వ్యూ సంద‌ర్భంగా తమ్మారెడ్డి....అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

రాజ్యాంగం ఇచ్చిన హ‌క్కు ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రూ త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించ‌వ‌చ్చ‌ని, అయితే ఆ అభిప్రాయాల‌పై వ‌చ్చే ప్ర‌తి స్పంద‌న‌ల గురించి ప‌ట్టించుకోకూడ‌ద‌న్నారు. చిరంజీవినో, బాలకృష్ణనో, పవన్ కల్యాణ్ నో, మహేశ్ బాబు గారినో తాను చాలాసార్లు విమ‌ర్శించాన‌ని, వారి అభిమానులు త‌న‌నూ తిట్టి ఉంటార‌ని చెప్పారు. అంత‌మాత్రాన, వాళ్లు తిట్టగానే తాను రెస్పాండై, ‘నన్ను తిడతావా?’ అని అంటే, మళ్లీ వాళ్లు తిడతార‌ని....ఈ ప్ర‌క్రియ అలా కొన‌సాగుతూనే ఉంటుంద‌ని....దాని వ‌ల్ల స‌మ‌స్య‌కు ఒక ప‌రిష్కారం ద‌క్క‌ద‌ని చెప్పారు.
ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని, 4 నెల‌ల‌నుంచి ఈ గొడ‌వ వ‌ల్ల చాలామంది స‌మయం వేస్ట‌వుతోంద‌ని కత్తి మహేశ్ కు చెప్పాన‌న్నారు. ఈ వివాదంపై పవన్ స్పందించాలని డిమాండ్ చేసే హక్కు మహేశ్ కు ఉందని, కానీ, స్పందించాల్సిన అవసరం ఉందో? లేదో? అవతలి వాళ్లకే తెలుసని చెప్పారు. మహేశ్ వంటి మ‌నుషులు స‌మాజానికి కావాల‌ని, కానీ, ఈ వివాదం వ‌ల్ల అత‌డు మ‌రోలా మారాడ‌ని, అస‌లు ఈ వివాదాల జోలికి వెళ్లాల్సిన అవసరం అతడికి లేదని చెప్పారు.

మ‌హేశ్ .....త‌న మానాన త‌న బ‌తుకు బతుకుతున్నాడని(ఫైనాన్షియల్ గా కాదు విలువలతో), కానీ....ఈ రోజున ఆ విలువలన్నీ పోగొట్టుకుంటున్నాడని హిత‌వు ప‌లికారు. తిడితే తిట్టారని పవన్ అభిమానులు వదిలేస్తే అసలు గొడ‌వే లేద‌ని, వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. `ఈ సమస్యకు నేనెట్లా ఫుల్ స్టాప్ పెడ‌తా? కత్తి మహేశ్ ని కొట్టనా? పవన్ కల్యాణ్ స్పందించాలని కత్తి మహేశ్ అంటున్నాడని చెప్పి ఆయన వద్దకు వెళ్లి అడగనా? నేను రాజీ చేయలేను. ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయమని ప్రతిరోజు నేను కత్తి మహేశ్ కు చెబుతున్నా. ఈ వివాదం వల్ల సమాజానికి కలిగే నష్టం గురించి చెబుతున్నా. కత్తి మహేశ్ అర్థం చేసుకోవాలి! అర్థం చేసుకోకపోతే నేనేమి చేయను?’ అని తమ్మారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏది ఏమైనా  ఈ వివాదం స‌ద్దుమ‌ణిగేలా చేసేందుకు త‌మ్మారెడ్డి,కోన వెంక‌ట్ వంటి వారు ప్ర‌య‌త్నించ‌డంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
 
Home
News
Photos
తెలుగు