English
Advertisement

ఈ ఫ్యాన్స్ ఉన్నారే.. వామ్మో!!

ఈ ఫ్యాన్స్ ఉన్నారే.. వామ్మో!!

పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి రిలీజ్ అయింది. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ రావడంతో.. ఈ ప్రభావం వసూళ్లపై కూడా పడుతోంది. ఏ కోణంలోను ఆడియన్స్ ను.. ఫ్యాన్స్ ను ఆకట్టుకోలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది యాంటీ ఫ్యాన్స్ కు అస్త్రంగా మారి.. విపరీతంగా ట్రాలింగ్ జరుగుతోంది.

సినిమా బాగోకపోతే ట్రాలింగ్ జరగడం ఈ మధ్య కనిపించే వ్యవహారమే కానీ.. అజ్ఞాతవాసిపై ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోందనే టాక్ ఉంది. దీనికి పవన్ కళ్యాణ్ బాగా గమనిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే పవన్ పై దాడి చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ (ప్రత్యర్థిని) దెబ్బ తీయాలంటే అతని ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలని.. ఆ తర్వాత అతని వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేయాలని... ఈ రెండు కోణాల్లోను ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై దాడులు చేస్తున్నారని భాష్యం చెపుతున్నారు కొందరు అభిమానులు. సింపుల్ గా చెప్పుకుంటే వీరి ఉద్దేశ్యం ఏంటంటే.. రికార్డు ఓపెనింగ్స్ సాధించిన అజ్ఞాతవాసిని ఫ్లాప్ చేయడానికి రాజకీయప్రత్యర్ధులు పన్నాగం అమలు చేస్తున్నారని చెబుతున్నారు.

ఇందులో నిజానిజాలు తేల్చడం కష్టమైన పనే కానీ.. నిజానికి పవర్ స్టార్ లాంటి హీరో మూవీకి టాక్ ఏ కొంచెం ఆశాజనకంగా ఉన్నా.. థియేటర్లకు జనాలు క్యూ కట్టేస్తారు. థియేటర్లకు రావాలని జనాలు ఫిక్స్ అయితే.. వారిని ఎలాంటి అజ్ఞాత శక్తులు ఆపలేవు. మరోవైపు మూవీ ఆకట్టుకోకపోయినంత మాత్రాన.. దాన్ని పట్టించుకునే పర్సనాలిటీ కాదు పవన్. మరి ఈ రెండు రకాల వ్యక్తులకు వీటిపై ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో? అసలు అవుతుందో అవదో?

Advertisement
 
Home
News
Photos
తెలుగు