English

క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ ముందున్న 3 ఆప్ష‌న్లు ఏమిటి?

క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ ముందున్న 3 ఆప్ష‌న్లు ఏమిటి?

క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన నాటి నుంచి తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. దేశ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే వీలున్న ఈ ఫ‌లితంపై దేశ వ్యాప్తంగా ప్ర‌త్యేక ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. దీనికి త‌గ్గ‌ట్లే క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌కీయం ఇప్పుడు ర‌స‌కందాయంలో ప‌డింది.
క‌ర్ణాట‌క‌లో రాజ్యాధికారాన్ని అప్ప‌గించే కీల‌క బాధ్య‌త ఇప్పుడు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా మీద ప‌డింది. ఆయ‌న నిర్ణ‌యం కీల‌కం కానుంది. తొలుత ఎవ‌రికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని పిలిస్తే.. వారికే అధికారం ద‌ఖ‌లు ప‌డుతుంద‌ని చెబుతున్నారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరేందుకు గ‌వ‌ర్న‌ర్ ముందు మూడు ఆప్ష‌న్లు ఉన్న‌ట్లుగా చెప్పొచ్చు. ఈ మూడింటిని చూస్తే..

1. కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మైన జేడీఎస్ నేత కుమార‌స్వామిని ఆహ్వానించ‌టం

2. అత్య‌ధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌మ‌న‌టం.. బ‌ల‌నిరూప‌ణ‌కు గ‌డువు ఇవ్వ‌టం

3. అసెంబ్లీని స‌స్పెన్ష‌న్ లో ఉంచ‌డ‌టం.

బీజేపీ నేత‌గా.. అందునా మోడీకి వీర విధేయుడిగా పేరున్న వ‌జూభాయ్ లాంటి నేత ఎలాంటి నిర్ణ‌యాన్ని తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌ప్పుడు బీజేపీ నేత అయి.. తాజాగా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విలో ఉన్న వేళ‌.. ఆయ‌న నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌న్న దానిపైనే క‌ర్ణాట‌క రాజ‌కీయం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పాలి.

బీజేపీతో పోలిస్తే.. జేడీఎస్.. కాంగ్రెస్ కూట‌మికే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఉంది. అయితే.. వాజుభాయ్ కుమార‌స్వామిని పిలిచి అధికార ప‌గ్గాలు అప్ప‌జెబుతారా? అన్న‌ది ప్ర‌శ్న‌. క‌ర్ణాట‌క ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత.. ఆస‌క్తిక‌ర‌రాజ‌కీయ చిత్రం చోటు చేసుకోవ‌టంతో గ‌వ‌ర్న‌ర్ అపాయిమెంట్ ను కాంగ్రెస్ కోరింది. వారిని క‌లుసుకునేందుకు గ‌వ‌ర్న‌ర్ నో చెప్పారు. బీజేపీ.. జేడీఎస్ నేత‌ల్ని తాను క‌లుసుకునేందుకు వీలుగా గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అది కూడా.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా బెంగ‌ళూరుకు చేరుకున్న త‌ర్వాతేన‌ని చెబుతున్నారు.

త‌న‌ను క‌లిసేందుకు స‌మ‌యం ఇచ్చే విష‌యంలోనే వ‌జూభాయ్ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. మొద‌టి ఆప్ష‌న్ ఇచ్చేందుకు ఆయ‌న సుముఖంగా ఉండ‌ర‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది.  మ‌రోవైపు.. త‌న‌ను క‌లుసుకునే తొలి అవ‌కాశం బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి యాడ్యుర‌ప్ప‌కు ఇవ్వం.. త‌మ‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని య‌డ్డీ గ‌వ‌ర్న‌ర్ ను కోరిన నేప‌థ్యంలో.. మొద‌ట‌గా త‌న‌ను కోరిన వారికి అవ‌కాశాన్ని ఇచ్చిన‌ట్లుగా గ‌వ‌ర్న‌ర్ చెబితే ఎవ‌రూ ఏమీ అన‌లేని ప‌రిస్థితి. అదే జ‌రిగితే.. కాంగ్రెస్‌.. జేడీఎస్ కు త‌లుపులు మూసుకుపోయిన‌ట్లే.
విచ‌క్ష‌ణ‌తో గ‌వ‌ర్న‌ర్ కానీ య‌డ్డీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఇస్తే.. ప‌రిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయ‌ని.. అదే జ‌రిగితే.. కాంగ్రెస్ కానీ.. జేడీఎస్ కానీ చీలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. బంగార‌ప్ప ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశ‌మే కాదు.. జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Advertisement