English

కర్ణాట‌క‌లో కుమార స్వామే కింగ్ మేక‌ర్!

కర్ణాట‌క‌లో కుమార స్వామే కింగ్ మేక‌ర్!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న కొద్దీ దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడుతోంది. మొద‌ట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆధిక్యంలో ఉన్న బీజేపీ....ఆ త‌ర్వాత 8 సీట్లు వెనుక‌బ‌డింది. మ‌రోవైపు కాంగ్రెస్, జేడీఎస్ ల ఆధిక్యం నిల‌క‌డ‌గా ఉంది. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం బీజేపీ 108, కాంగ్రెస్ 72, జేడీఎస్ 40 సీట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

దీంతో, కాంగ్రెస్ తో క‌లిసి జేడీఎస్ హంగ్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశ‌ముంద‌ని పుకార్లు వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా  సిద్ధ రామ‌య్య ఇంట్లో జేడీఎస్, కాంగ్రెస్ ముఖ్య నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. కాంగ్రెస్, జేడీఎస్ లు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి....కుమార స్వామికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీక‌రించిందని తెలుస్తోంది.

క‌న్న‌డ‌నాట రాజకీయ పరిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ముందుగా ఊహించిన‌ట్లుగానే కుమార‌స్వామి కింగ్ మేక‌ర్ అయ్యారు. క‌ర్ణాట‌క‌లో దాదాపుగా కాంగ్రెస్, జేడీఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌బోతోంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు, కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేత‌లు ...ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని గ‌వ‌ర్న‌ర్ ను క‌లవ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్, జేడీఎస్ అధినేత దేవెగౌడ‌లు ...ఈ సాయంత్రం గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటు పై చర్చించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు, గ‌వ‌ర్న‌ర్ ను సిద్ధ‌రామ‌య్య ...ఈ రోజు సాయంత్ర 4 గంట‌ల‌కు క‌ల‌వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నిక‌ల‌కు ముందే జేడీఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని ఉంటే బీజేపీకి అంత మెజారిటీ వ‌చ్చేది కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Advertisement