English

ఎమ్మెల్యే కారును ఢీ కొన్న లారీ.. ఆమె సేఫ్

ఎమ్మెల్యే కారును ఢీ కొన్న లారీ.. ఆమె సేఫ్

ఏపీ మాజీ మంత్రి పీత‌ల సుజాత‌కు తృటిలో ప్రాణాపాయం త‌ప్పింది. చింత‌ల‌పూడి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమె నిజంగా అదృష్ట‌వంతురాలు. పెను ప్ర‌మాదం నుంచి ఆమె సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ‌టంపై ప‌లువురు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొని వ‌స్తున్న ఎమ్మెల్యే పీత‌ల సుజాత ప్ర‌యాణిస్తున్న కారును గుంటూరుజిల్లా కాజ టోల్ గేట్ వ‌ద్ద ప్ర‌మాదానికి గురైంది. వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన లారీ.. బ్రేక్ వేయ‌టంలో జ‌రిగిన పొర‌పాటుతో ఆమె కారును వెన‌క నుంచి ఢీ కొట్టారు. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ప్పుడు పీత‌ల సుజాత కారులో ఉన్నారు.

పెద్ద శ‌బ్ధం చోటు చేసుకోవ‌టం.. లారీ ఢీ కొన‌టంతో ఎమ్మెల్యేకు ఏమైనా జ‌రిగిందా? అన్న అదుర్దా వ్య‌క్త‌మైంది. అదృష్ట‌వ‌శాత్తు ఎలాంటి గాయాలు లేకుండానే పీత‌ల సుజాత త‌ప్పించుకున్నారు.ఈ ప్ర‌మాదం గురించి ప‌లువురు నేత‌లు పీత‌ల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు.

Advertisement