English
Advertisement

ఒక్క హిట్టు కోసం రకుల్ రచ్చ..

ఒక్క హిట్టు కోసం రకుల్ రచ్చ..

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ అయ్యారే. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన రకుల్ ప్రీత్.. తను ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు తెగ కుస్తీలు పట్టేస్తోంది. ఈ సినిమాను రెండు నెలలుగా బీభత్సంగా ప్రమోట్ చేసేస్తోంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో.. అయ్యారే పై బజ్ బాగానే ఉంది.

ఈ నెల 16న విడుదల కానున్న ఈ సినిమా కోసం  ఇప్పుడు పబ్లిక్ హగ్గులకు కూడా దిగిపోయింది రకుల్ ప్రీత్. రీసెంట్ గా హీరో సిద్ధార్ధ మల్హోత్రాతో కలిసి ఓ కాలేజ్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొంది రకుల్ పాప. ఇక్కడ ఓ సందర్భంలో.. రకుల్ ను తన రెండు చేతులతో ఎత్తుకున్నాడు సిద్ధార్ధ. ఇందుకు రకుల్ కూడా బాగానే తన తోడ్పాటును అందించింది. అఫ్ కోర్స్.. సినిమా కంటెంట్ కి దీనికి సింక్ ఉందేమో అనుకోకండి. ఆ మూవీ జోనర్ వేరే. కానీ జస్ట్ సినిమా పబ్లిసిటీ కోసం.. ఆ చిత్రానికి తద్వారా తనకు క్రేజ్ సంపాదించుకునేందుకే రకుల్ ఇలా తిప్పలు పడుతోంది.

కొన్ని రోజుల క్రితం మ్యాగ్జిమ్ మ్యాగజైన్ లో బికినీ మరియు లోదుస్తుల్తో అందాల జాతర చేసేందుకు కారణం కూడా అయ్యారే చిత్రమే. నిజంగా ఈ సినిమా రకుల్ కి ఎంత హెల్ప్ అవుతుందో చెప్పలేకపోవచ్చు కానీ.. ఈ భామలో తెలుగు ఆడియన్స్ చూడని కొత్త కోణాలను మాత్రం బయటకు తీస్తోంది.

Advertisement