English

జైలవకుశపై దిల్‌రాజు రిస్క్‌ ఎంతంటే?

జైలవకుశపై దిల్‌రాజు రిస్క్‌ ఎంతంటే?

ఈ ఏడాది ఆరంభంలో నిర్మాతగా బిజీగా వున్న దిల్‌ రాజు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా తీరిక లేకుండా వున్నాడు. దసరాకి రిలీజ్‌ అవుతోన్న మూడు సినిమాల నైజాం హక్కులని దిల్‌ రాజు కొనేసాడు. వేర్వేరు పంపిణీదారులకి ఇస్తే థియేటర్ల కేటాయింపు పరంగా సమస్య వస్తుందని ఆయా నిర్మాతలు కూడా దిల్‌ రాజునే ప్రిఫర్‌ చేసారు.

మిగతా బయ్యర్లు ఎక్కువ కోట్‌ చేసినా కానీ దిల్‌ రాజుతో వున్న అడ్వాంటేజ్‌ వల్ల అతనికే రైట్స్‌ ఇచ్చేసారు. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం పోషిస్తోన్న 'జై లవకుశ' చిత్రం నైజాం హక్కులతో పాటు వైజాగ్‌ ఏరియా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ కూడా దిల్‌ రాజు కైవసం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు ఎన్‌ఆర్‌ఏ, అడ్వాన్స్‌ రెండు పద్ధతుల్లోను సొంతం చేసుకున్నాడు. నైజాం హక్కులు ఇరవై కోట్లకి తీసుకున్నాడు కానీ ఇందులో దిల్‌ రాజు రిస్క్‌ పద్ధెనిమిది కోట్లు.

అంటే ఒకవేళ ఈ చిత్రం ఇరవై కోట్లు సాధించని పక్షంలో ఆ రెండు కోట్లలో ఎంత లోటు వచ్చిందో అంత నిర్మాత తిరిగి ఇస్తాడన్నమాట. అలాగే వైజాగ్‌ ఏరియా హక్కులు ఎనిమిది కోట్లకి తీసుకోగా దిల్‌ రాజుపై భారం ఏడున్నర కోట్లు అట. మొత్తం మీద జై లవకుశ చిత్రంపై దిల్‌ రాజు పాతిక కోట్లపైనే రిస్క్‌ చేసాడు. ఎన్టీఆర్‌ కెరియర్‌లోనే అత్యధిక రేట్లకి అమ్ముడయిన ఈ చిత్రం ఏ స్థాయిలో ఆడుతుందనేది చూడాలిక.

Advertisement