English

ఎన్టీఆర్‌ ఝలక్‌తో దిమ్మ తిరిగింది

ఎన్టీఆర్‌ ఝలక్‌తో దిమ్మ తిరిగింది

'బిగ్‌బాస్‌' ఫస్ట్‌ సీజన్‌ పతాక దశకి చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఫైనల్‌కి గ్యారెంటీ కంటెస్టెంట్‌ అనుకున్న ప్రిన్స్‌ని ఎలిమినేట్‌ చేసి షాకిచ్చారు. ఫైనల్‌కి వెళ్లే ముందు కావాల్సిన డ్రామా మొత్తం ఈ ఎలిమినేషన్‌తో తీసుకొచ్చారు. కొన్ని వారాలుగా చప్పగా సాగిపోతున్న షోకి ఒక్కసారే ఊపు వచ్చింది. అయితే ఈ ఊపు తేవడంలో ఎన్టీఆర్‌ పోషించిన పాత్ర షాకిచ్చింది.

మామూలుగా ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ని క్వశ్చన్‌ చేయని ఎన్టీఆర్‌, ఎలిమినేషన్‌కి ఎవరిని నామినేట్‌ చేయాలనే విషయంలో ఎంత లాజికల్‌గా ఆలోచించాలనేది చెప్పడమే కాకుండా, ప్రిన్స్‌ ఎలిమినేషన్‌కి పరోక్షంగా నువ్వే కారణమంటూ ఆదర్శ్‌ని బహిరంగంగా ఎత్తి చూపించి అతడిపై మానసిక ఒత్తిడిని పెంచాడు. హౌస్‌లో వీక్‌గా కనిపిస్తోన్న ఆదర్శ్‌ పట్ల సింపతీ వేవ్‌ వచ్చేలా ఆదివారం ఎపిసోడ్‌ని మలిచిన తీరు అబ్బురపరిచింది. ఫైనల్‌కి ఇతను గ్యారెంటీగా వెళ్లడనేది కొద్ది వారాలుగా అందరి నమ్మకం.

కానీ ఆదర్శ్‌పై అభాండాలు వేసి, కనీసం అతనికి వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా జనాల్లో అతనిపట్ల సానుభూతి తెప్పించారు. సోషల్‌ మీడియాలో ఈ విషయంపై జరుగుతోన్న చర్చ చూస్తేనే ఇది స్పష్టమవుతుంది. అలాగే ఈ సీజన్‌ తప్పక గెలిచేస్తుందనే ఫీలింగ్‌ తెప్పించిన హరితేజని కూడా కార్నర్‌ చేసారు. ఆమె ఇతర హౌస్‌మేట్స్‌ని తన గ్రిప్‌లో వుంచుకుని ఆట తన కంట్రోల్‌లో పెట్టుకుందనే భావన రేకెత్తించారు. దీంతో ఇప్పుడామెని ఆడియన్స్‌ మరో కోణంలో చూస్తారు.

ఇలా బలమైన కంటెస్టెంట్‌ని కార్నర్‌ చేసి, బలహీనుడైన కంటెస్టెంట్‌ పట్ల సింపతీ క్రియేట్‌ చేసి ఫైనల్‌ని ప్రిడిక్ట్‌ చేయనివ్వకుండా చేసి ఆసక్తిని నిలబెట్టారు. ఈ స్ట్రాటజిస్ట్‌ ఎవరనేది తెలియదు కానీ ఈ ప్లాట్‌ ట్విస్ట్‌ మాత్రం అద్భుతంగా వర్కవుట్‌ అయింది. లాస్ట్‌ టూ వీక్స్‌లో టీవీ రేటింగులు తారాస్థాయిలో వుండడమే కాకుండా ఓటింగ్‌ కూడా ఉధృతంగా జరగడానికి ఇది బీజం వేసింది.

Advertisement